పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం: సమంత

39
sam

పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం అని తెలుసుకున్నానని తెలిపారు సినీ నటి సమంత. కరోనా మహమ్మారి నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది.ఏడాదిగా నా ఇంటి టెర్రస్‌ మీద హైడ్రోపోనిక్స్‌ టెక్నిక్‌తో వివిధ రకాల కూరగాయలను, ఆకుకూరలను పెంచుతున్నాను. అందరూ ఇళ్లలో పచ్చని మొక్కలను పెంచితే ఆరోగ్యంగా ఉంటాం. నేను పూర్తిగా శాఖాహారిగా మారాను అని సమంత చెప్పారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని పెంపొందించడం అన్న విషయంపై ఓ సంస్థ నిర్వహించిన వర్చువల్‌ సదస్సులో పాల్గొన్నారు సమంత. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.