రెమ్యునరేషన్‌పై చరణ్ ఆసక్తికర కామెంట్స్‌!

34
ram charan

హీరోల రెమ్యునరేషన్‌పై రామ్ చరణ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాల కోసం రామ్ చరణ్ రూ.100 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుండగా తనదైన శైలీలో స్పందించారు.

100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చరణ్‌ని అడగ్గా అవన్నీ నిరాధారమైన రూమర్స్ అని అన్నారు. ఈ 100 కోట్లు ఎక్కడివి ? ఎవరు ఇస్తున్నారు నాకు ? ముందుగా ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చరణ్ నవ్వుతూ చెప్పాడు.

రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్ఆర్ జనవరి 7న విడుదలవుతుండగా తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళ భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ ముగ్గురూ దేశమంతటా పర్యటిస్తున్నారు.