దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి: టికాయత్

50
tikayath
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్నారు రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో రాకేశ్ తికాయ‌త్ పాల్గొని ప్ర‌సంగించారు.

ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేస్తోంది…. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం కేంద్రానికి సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఈ ఆందోళ‌న చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న‌ది రాజ‌కీయ ఉద్య‌మం కాదు అని తికాయ‌త్ స్ప‌ష్టం చేశారు. ఈ ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాను. రైతుల కోసం పోరాటం ఎవ‌రు చేసినా వారికి మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే ఉంటారు.. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి రావాల్సి వ‌స్తుందన్నారు. సాగుచ‌ట్టాల ర‌ద్దు కోసం ఢిల్లీలో 13 నెల‌ల పాటు ఉద్య‌మించాం అని గుర్తు చేశారు.

- Advertisement -