ఇది చారిత్రక దీక్ష: నిరంజన్ రెడ్డి

73
niranjan reddy
- Advertisement -

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ గులాబీమ‌యం అయింది. ధాన్యం సేక‌ర‌ణ‌పై తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ దీక్ష చేప‌ట్టగా ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇది చారిత్రక దీక్ష అని…అన్నదాతల కోసం హస్తినకు వచ్చాం అన్నారు. ఒక అనివార్య పరిస్థితిని కేంద్రం కల్పించిందని….కేంద్రం మోసాన్ని ముందే గ్రహించి కేరాఫ్ అప్రమత్తం చేశారన్నారు.

వానాకాలం ముందే యాసంగి పంట గురించి అడిగితే బీజేపీ నేతలు యాసంగి గురించి ఎందుకు అన్నారు….మంత్రుల బృందం పలుమార్లు కేంద్రాన్ని కలిసింది…కేసీఆర్ గారు ప్రధానికి రాసిన లేఖలో కొత్త మార్గాలు అన్వేషించాలని కోరారన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలి మిగతా పంటలు ఎలా కొంటారో ఇది అలాగే కొనాలి అని కేంద్ర మంత్రిని కోరాం అని తెలిపిన నిరంజన్ రెడ్డి…తెలంగాణ రైతుల పట్ల బాధ్యత లేకుండా తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని కేంద్ర మంత్రి అవహేళన చేశారన్నారు.

పంజాబ్ ను తలదన్ని తెలంగాణ రైతులు ధాన్యం పండించారని….తెలంగాణను కేంద్రం అభినందించాల్సింది పోయి వేధిస్తుందన్నారు. తెలంగాణలో పండిన పంటలు కేసీఆర్ దార్శనికత, ముందుచూపుకు నిదర్శనం అన్నారు. తెలంగాణ నీళ్లలో, కరంటులో, రైతుబంధులో, రైతుభీమాలో కేంద్రం సాయం లేదు .. చివరకు పంట కొనాల్సిన బాధ్యత నుండి బాధ్యతారహితంగా వైదలగుతున్నారు….దేశ రైతాంగాన్ని రోడ్డు మీదకు తెచ్చి వారి నిరసనకు తలొగ్గి లెంపలేసుకున్న చరిత్ర బీజేపీది అన్నారు.

- Advertisement -