22న పార్లమెంట్‌ వెలుపల నిరసన:రైతు సంఘాలు

158
rakesh

ఈ నెల 19వ తేదీ నుంచి ఆగస్ట్‌ 13 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు నిరసనగా శాంతియుత ప్రదర్శణ చేపట్టాలని నిర్ణయించినట్లు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయిత్ తెలిపారు. ఈ నెల 22న పార్లమెంట్‌ వెలుపల నిరసన ప్రదర్శన చేస్తామని వెల్లడించారు.

రిపబ్లిక్‌ దినోత్సవం రోజున చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగినా.. ప్రస్తుతం శాంతియుతంగా పార్లమెంట్‌ వెలువల నిరసనకు కూర్చుంటామన్నారు. 200 మంది రైతులు బస్సులో పార్లమెంట్‌కు వెళ్తారని, ఛార్జీలను సైతం తామే చెల్లిస్తామన్నారు. గతేడాది అమలులోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానికి సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.