- Advertisement -
రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కరోనా విస్తృతి నేపథ్యంలో సమావేశాల గడువును వారం రోజులు కుదిస్తున్నట్లు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే పలు కీలక బిల్లులకు సభ ఆమోదం లభించింది. విపక్షాల గైర్హాజరీలోనే సభా కార్యకలాపాలు కొనసాగాయి. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరుగాల్సి ఉంది.
- Advertisement -