రియా చక్రవర్తికి మరో షాక్‌..

104
Rhea Chakraborty

నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల విచార‌ణ వాయిదా ప‌డింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జస్టిస్ సారంగ్ కొత్వాల్ సింగిల్ బెంచ్ రియా బెయిల్ పిటిష‌న్‌ను బుధవారం విచారించాల్సి ఉంది.

అయితే నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీం​తో రేపు(గురువారం) బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.