9 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్ ‘దూకుడు’..

225
Dookudu movie

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన సినిమాల్లో ‘దూకుడు’ ఒకటి. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. దూకుడు సినిమా సెప్టెంబర్ 23 ,2011 లో విడుదల అయ్యింది. నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకంది ఈ చిత్రం. మహేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన పోకిరి సినిమా అప్పటికే భారీ హిట్ అందుకుంది . అలాగే మహేష్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా దూకుడు సినిమాలో ఆకట్టుకున్నాడు. దాంతో ఈ సినిమా పోకిరిని మించి విజయాన్ని అందుకుంది.

మహేష్ యాక్షన్, సమంత గ్లామర్ ఈ మూవీకి విజయంలో దోహదం చేశాయి. దూకుడు మూవీ భారీ విజయంలో క్రెడిట్ బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలకు కూడా ఇవ్వాల్సిందే. ముఖ్యంగా బ్రహ్మానందం మరియు మహేష్ కాంబినేషన్ లో వచే కామెడీ ఎపిసోడ్స్ థియేటర్స్ లో ఓ రేంజ్ లో పేలాయి. ఈ చిత్రానికి థమన్‌ అందించిన సంగీతం మరో హైలెట్ నిలిచారు. మొత్తంగా కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ కలిపి మహేష్‌కు బ్లాక్‌ బస్టర్‌ అందించాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ చిత్రం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ ను కూడా చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి కావడంతో అప్పటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. దూకుడు సెట్స్ లో ప్రతీ నిమిషమూ ఎంజయ్ చేసానని నా కెరీర్ లో ఒక మైలురాయి లాంటి క్రేజీ మరియు ఎమోషనల్ సినిమాను ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీను వైట్ల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.