ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన‌ వేళ‌.. పిక్ వైరల్

76
Rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అన్నాత్తె సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంట‌కి వెళ్లారు. అక్క‌డే రెండు రోజుల‌పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గ‌డిపారు. అక్క‌డి నుండి డైరెక్ట్‌గా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు.

ఆ స‌మ‌యంలో ర‌జినీకాంత్‌, మోహ‌న్‌బాబు, విష్ణు మంచు క‌లిసి దిగిన ఫోటోల‌ను ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌.. అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు విష్ణు మంచు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.