వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించిన సీఎం కేసీఆర్‌..

48

వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించారు. జైలులోని ఖైదీల‌ను ప‌రామ‌ర్శించి వారి నేర కార‌ణాల‌ను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌక‌ర్యాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఖైదీలు త‌యారు చేసిన ప‌లు ర‌కాల చేనేత ఉత్ప‌త్తులు, ఇత‌ర వ‌స్తువుల‌ను సీఎం ప‌రిశీలించారు. అంత‌కుక్రితం ఎంజీఎం ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన సీఎం అక్క‌డి కొవిడ్ రోగులను ప‌రామ‌ర్శించారు. వారి ఆరోగ్య వివ‌రాల‌ను, అందుతున్న సేవ‌ల‌ను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవ‌రూ అధైర్య‌ప‌డొద్ద‌ని భ‌రోసా క‌ల్పించారు.