సుందర్ లాల్ బహుగుణ మృతికి ఎంపీ సంతోష్ సంతాపం..

51
MP Santosh

ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు, గాంధేయవాది సుందర్ లాల్ బహుగుణ మృతిపట్ల రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సుందర్ లాల్ బహుగుణ ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేశారు అని గుర్తుకు చేశారు. హిమాలయాల్లోని అడవుల నరికితేకు వ్యతిరేకంగా సుందర్ లాల్ బహుగుణ చేపట్టిన చిప్కో ఉద్యమం (చెట్లను నరకడాన్ని నిరసిస్తూ వాటిని కౌగిలించుకోవడం) పర్యావరణ పరిక్షకులకు మార్గనిర్దేశనం చేశాడు అని సంతోష్ కుమార్ కోనియాడారు.

పర్యావరణాన్ని విధ్వంసపరిచే ఆనకట్టల నిర్మాణానికి, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి సుందర్ లాల్ బహుగుణ అని కీర్తించారు. అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం ఆయన జీవితాంతం పరితపించారని సంతోష్ కుమార్ తెలిపారు. సుందర్ లాల్ బహుగుణ వంటి పర్యావరణవేత్తల స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టామని అని అన్నారు. ఆయన మరణం పర్యావరణ రంగానికి తీరని లోటు అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో సుందర్ లాల్ బహుగుణ స్ఫూర్తిని కొనసాగిస్తామని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తెలిపారు.