టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నా రాజస్థాన్‌..

125
Rajasthan Royals

షార్జాలో జరుగుతున్న ఐపీఎల్‌-13లో భాగంగా ఆదివారం మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ సారధ్యంలోని కింగ్స్ లెవన్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

తొలి మ్యాచ్‌కు దూరమైన రాజస్థాన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ జట్టులోకి వచ్చాడు. యువ ఓపెనర్‌ జైశ్వాల్‌ స్థానంలో బట్లర్‌, డేవిడ్‌ మిల్లర్‌ స్థానంలో అంకిత్‌ రాజ్‌పుత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు స్మిత్‌ చెప్పాడు. మరోవైపు యూనివర్స్‌ బాస్‌, విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌గేల్‌కు పంజాబ్‌ టీమ్‌లో చోటు దక్కలేదు. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడిన రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో విజయం కోసం తలపడుతున్నారు. 5 ఓవర్లకు గాను 60 పరుగులు చేసింది పంజాబ్. ప్రస్తుతం రాహుల్ మయాంక్ క్రీజులో ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు: స్టీవ్ స్మిత్, జాసన్ బట్లర్, సంజూ శాంసన్, ఉతప్ప, పరాగ్, కరన్, తెవాతియా, ఎస్. గోపాల్, ఆర్చర్, రాజ్‌పూత్, ఉనద్కత్

కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, పూరన్, ఖాన్, మ్యాక్స్‌వవెల్, నీషమ్, అశ్విన్, కాట్రెల్, షమి, బిష్ణోయ్