ఏపీలో కరోనా తగ్గుముఖం..

109
Covid-19

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయస్థాయిలో తగ్గుతోంది. అందుకు తాజా గణాంకాలే నిదర్శనం. గడచిన 24 గంటల్లో 6,923 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా గణాంకాలు చూస్తే, ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,674కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,708కి పెరిగింది. మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 64,876 మంది చికిత్స పొందుతున్నారు.

అదే సమయంలో 45 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 8 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి భారీగా కేసులు వచ్చాయి. తాజాగా 1,006 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. రాష్ట్రంలో మరో 7,796 మందికి కరోనా నయం అయిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.