బట్లర్ విధ్వంసం…రాజస్థాన్ గెలుపు

99
rr
- Advertisement -

బట్లర్ విధ్వంసంతో రాజస్థాన్ మరో విజయాన్ని నమోదుచేసింది. ఢిల్లీ బౌలర్లను ఉచకోత కోసిన బట్లర్…వారికి చుక్కలు చూపించాడు. దీంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది.రాజస్థాన్ విధించిన 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ…నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో 15 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది.

రిషభ్‌ పంత్‌ (24 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), లలిత్‌ యాదవ్‌ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (27 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రావ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 36; 5 సిక్స్‌లు) రాణించారు.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ జోస్‌ బట్లర్‌ (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఈ సీజన్‌లో మూడో సెంచరీతో చెలరేగగా… దేవదత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (19 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.

- Advertisement -