రైలు క్లీనింగ్‌లో నాడు.. నేడు…

31
- Advertisement -

ప్రాచీన భారతీయ రైల్వేలు దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.  గడిచిన పదేళ్ల కాలం నుంచి రైల్వే రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా మేక్‌ఇన్‌ ఇండియాలో భాగంగా తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైల్వేలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి రైల్వే రంగంపై మరింత పెట్టుబడులను ఆకర్షిస్తోంది.

తాజాగా రైల్వే వ్యవస్థ మారిందంటూ ఒక వీడియోను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్టర్‌ ద్వారా ఆదివారం షేర్ చేసింది. గత కొన్నేళ్లుగా సిబ్బంది రైలు బోగీలను చేతులతో, చేతి స్ప్రే పంపుతో శుభ్రం చేస్తున్నారు. అయితే ఇటీవల ఆధునిక క్లీనింగ్‌ వ్యవస్థను రైల్వే ప్రవేశపెట్టింది. నీరు వెదజల్లే షవర్‌ కింద రైలు మెల్లగా వెళ్తుండగా రైలు పట్టాలకు ఇరు పక్కల ఉన్న బ్రెష్‌ల ద్వారా ట్రైన్‌ కంపార్ట్‌మెంట్‌లు ఆటోమేటిక్‌గా క్లీన్‌ అవుతాయి. దీనికి ‘హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు’ అని శీర్షిక పెట్టింది. గత కొన్ని ఏళ్లుగా పాటిస్తున్న రైలు క్లీనింగ్‌ విధానం ప్రస్తుతం ఇలా మారిందని పేర్కొంది. సోషల్ మీడియాలో విడుదలైన కొన్ని గంటల్లోనే నాలుగు లక్షల మంది వీక్షించారు. ఇది పూర్తిగా 17సెకండ్ల నిడివి కలిగి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేగా..

కోల్‌కతా…పరీక్ష కోసం గ్రీన్ కారిడార్

శంషాబాద్‌లో ఆలయ్‌ రోలింగ్ మెడోస్ లగ్జరీ విల్లాస్

- Advertisement -