యూకేలో పీవీ శత జయంతి ఉత్సవాలు..

261
pv

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కెసిఆర్, కేటీర్, కవితల పిలుపు మేరకు తెలంగాణ జాగృతి యూకే ఆధ్వర్యంలో సుమన్ రావు బల్మూరి అధ్యక్షతన జాగృతి సభ్యులు కిషోర్ కుమార్ మునగాల, మానస టేకుమట్ల, రఘు జక్కుల, గణేష్ మల్యాల, వెంకట్ బలిగొని, రాజేష్ ఎనపోతుల, మధుకర్ కుఱిమిళ్ళ, రవి మేడిపల్లి, మరియు యువజన బృందం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు రావు జయంతి సందర్భంగా సంవత్సరకాలం పాటు శతజయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది.

అధ్యక్షుడు సుమన్ రావు మాట్లాడుతూ.. బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, సాహితీవేత్త ఐన పివీ నరసింహారావు సేవలను స్తుతించడం, మరియు సంవత్సర కాలం పాటు జయంతి ఉత్సవాల కార్యాచరణకు నాంది పలకడం జరిగింది. కార్యక్రమం లో కిషోర్ మునగాల మరియు మానస లు నరసింహారావు రాజకీయ ప్రస్థానం, సాహితీ ప్రస్థానం గురించి ప్రస్తావించడం కొసమెరుపు.