విశాఖలో మరోసారి గ్యాస్ లీక్…ఇద్దరు మృతి

39
vishaka gas leake

విశాఖలో మరోసారి గ్యాస్ లీకైంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవకముందే పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో గ్యాస్ లీకైంది. లీకైన గ్యాస్‌ను బెంజో మిడజోల్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని గాజువాకలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని నరేంద్ర, గౌరీ శంకర్‌లుగా గుర్తించారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉంది. సంఘటన స్ధలాన్ని కలెక్టర్, పోలీస్ కమిషనర్ పరిశీలించారు.

ఇటీవలె గోపాలపట్నంలో గ్యాస్ లీకై పదుల సంఖ్యలో మృత్యువాత పడగా వరుస సంఘటనలతో విశాఖ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.