రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా పాజిటివ్‌ కేసులు..

123
corona

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిత్యం వందల సంఖ్యల్లో పెరుగుతోంది.. ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికి కరోనా కట్టడికావడం లేదు. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. సోమవారం జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు వచ్చాయి.

తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. వీరిలో కరోనాతో 253 మంది మరణించగా.. 5,582 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.. ప్రస్తుతం తెలంగాణలో 9,559 యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో 2,648 శాంపిల్స్ పరీక్షంచగా.. 1,673 మందికి నెగెటివ్ వచ్చింది. 975 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటి వరకు 85,106 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నమోదైన కేసుల వివరాలు.. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్ 10, భద్రాద్రిలో 8, వరంగల్ రూరల్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 4, మహబూబ్ నగర్‌లో 3, నల్గొండ, యాదాద్రి, కామారెడ్డిలో 2 చొప్పున, సిద్దిపేట, అసిఫాబాద్, గద్వాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి.