రాణించిన గేల్‌,రాహుల్‌…..ఆర్సీబీపై పంజాబ్ గెలుపు

231
kl rahul
- Advertisement -

ఐపీఎల్‌ 2020లో భాగంగా షార్జా వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది.చివరి వరకు సస్పెన్స్ గా సాగిన మ్యాచ్ లో బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి 177 పరుగులు చేసి విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండో విజయాన్ని పంజాబ్ నమోదు చేయగా ఆర్సీబీ 3వ పరాజయాన్ని మూటగట్టుకుంది.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడగా మరో ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ ధాటిగా ఆడాడు. అగర్వాల్ 25 బంతుల్లో 3 సిక్స్‌లు,4 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు.తర్వాత క్రిస్ గేల్‌తో కలిసి ధాటిగా ఆడారు కేఎస్ రాహుల్. ముఖ్యంగా గేల్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత తనదైన స్టైల్‌లో సిక్స్‌లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకపడ్డాడు. గేల్ 45 బంతుల్లో 5 సిక్స్‌లతో 53 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరుగగా రాహుల్‌ 49 బంతుల్లో 5 సిక్స్‌లు 1 ఫోర్ సాయంతో 61 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా లాస్ట్ బాల్ వరకు సాగింది మ్యాచ్. లాస్ బాల్ ఒక పరుగు చేయాల్సి ఉండగా క్రీజులోకి వచ్చిన పురాన్ సిక్స్ కొట్టి పంజాబ్ ను గెలిపించాడు.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(48: 39 బంతుల్లో 3ఫోర్లు) రాణించగా ఫించ్ 20,పడిక్కల్ 18,దూబే 23 రాణించగా ఆఖర్లో క్రిస్‌ మోరీస్‌(25 నాటౌట్‌:8బంతుల్లో ఫోర్ 3సిక్సర్లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆర్సీబీ స్కోరు 170 దాటింది. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమి(2/45),మురుగన్‌ అశ్విన్‌(2/23) వికెట్లు తీశారు.

- Advertisement -