31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు…

95
lrs

లేఅ‌వుట్‌ రెగ్యు‌ల‌రై‌జే‌షన్‌ స్కీమ్‌ (ఎ‌ల్‌‌ఆ‌ర్‌‌ఎస్‌) దర‌ఖా‌స్తుల గడు‌వును పొడిగించింది ప్రభుత్వం. ఈ నెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భారీ వర్షాల కార‌ణంగా అనేక చోట్ల విద్యుత్‌ సర‌ఫరా, ఇంట‌ర్నెట్‌ సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో చాలా‌చోట్ల భూ యజ‌మా‌నులు ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు దర‌ఖాస్తు చేసు‌కో‌లేక పోయారు.

దీంతో ప్రస్తుత పరిస్ధితిని గమనించిన సీఎం కేసీఆర్ ఈ నెల 31 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గురు‌వా‌రం‌నా‌టికి మొత్తం 18,99,876 దర‌ఖా‌స్తులు రాగా, ఒక్క‌రోజే 2.71 లక్ష‌లకు పైగా దర‌ఖా‌స్తులు వచ్చి‌నట్టు అధికారులు తెలిపారు.