గొడవల్లేవ్.. స్నేహితులమే!

25
- Advertisement -

టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీ టైమ్ లో ఈ రకరమైన రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఆ మద్య మాజీ ఆటగాళ్లు సైతం వారి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడంతో అందరూ కూడా నిజమే అని భావించారు. ఇక కోహ్లీని వన్డే, టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనక రోహిత్ శర్మ ఉన్నాడనే టాక్ కూడా బలంగానే వినిపించింది. తాజాగా రోహిత్ తో విభేదాల విషయంపై విరాట్ కోహ్లీ తనదైన రీతిలో స్పందించారు. తమిద్దరం మంచి స్నేహితులమని.. ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో నిర్మొహమాటంగా రోహిత్ తో మాట్లాడతానని, రోహిత్ కూడా ఏ విషయమైన తనతో చర్చిస్తాడని కోహ్లీ చెప్పుకొచ్చారు..

ఇక వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరి మధ్య స్నేహం ఎలా ఉంటుందో అభిమానులు ప్రత్యక్షంగా తిలకించారు. తాజాగా కోహ్లీ కూడా వారి స్నేహంపై నోరువిప్పడంతో రూమర్స్ కి చెక్ పడింది. ఇకపోతే భారత్ సౌతాఫ్రికా మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టెస్ట్ స్టంప్స్ సమయానికి టీమిండియా 59 ఓవర్లలో 208/8 స్కోర్ వద్ద నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయగా రోహిత్ శర్మ ఐదు పరుగులకే నిష్క్రమించి అందరిని నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31), జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక కే‌ఎల్ రాహుల్ (70) కీలక ఇన్నింగ్స్ తో జట్టును మెరుగైన స్థితిలో ఉంచాడు. ప్రస్తుతం కే‌ఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ క్రీజ్ లో ఉన్నారు.

Also Read:Mahesh:సంక్రాంతికి సోలోగా మహేష్?

- Advertisement -