శ్రీవారిని దర్శించుకున్న పుల్లెల గోపిచంద్..

90
gopi chand

తిరుమల శ్రీవారిని మాజీ బ్యాట్మింటన్ ఆటగాడు పుల్లెల గోపిచంద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ…. శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని….. మంచి దర్శనాన్ని కల్పిస్తున్న టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ తిరుపతిలో జరగనున్న లే పంగ…కబాడీ జాతీయ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొంటున్నట్లు చెప్పారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జాతీయ స్థాయి స్పోర్ట్ మీట్ కు సంకల్పించిన ఎమ్మెల్యే భూమన., మేయర్ శిరీషా., కమిషనర్ గిరీషాల ప్రయత్నం అభినందనీయం అన్నారు.