హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమావేశాలు

28
rss

హైద‌రాబాద్ అన్నోజిగూడ ఆర్వీకే కేంద్రంగా మూడు రోజుల పాటు ఆర్‌ఎస్ఎస్ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ కు చెందిన 36అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఆయా అనుబంధ సంఘాల జాతీయ అధ్యక్షులు, సంస్థాగ‌త ప్ర‌ధాన కార్యాద‌ర్శులకు మాత్రమే ఆహ్వానం అందగా తెలంగాణ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.బీజేపీ జాతీయ అద్య‌క్షుడు జేపీ నడ్డా,ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ బీఎల్ సంతోష్ లు పాల్గొంటారు

వీహెచ్పీ అధ్య‌క్షుడు అలోక్ కుమార్, సంస్థ‌గ‌త ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి మిలింద్ ప‌రాండే ,ఏబీవీపీ నుండి జాతీయ అధ్య‌క్షుడు ఆశిశ్ చౌహాన్ , సంస్థాగ‌త ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి నిధి తిరుప‌తి హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాలు చ‌ర్చకు వ‌చ్చే అవ‌కాశం ఉండగా దేశంలో తాజా ప‌రిస్థితులు, హిందులపై దాడులు , విద్యారంగం, వాతావరణంలో మార్పులు, కుంటుబ విలువలపై  ప్ర‌ధానంగా చ‌ర్చించే అవ‌కాశముందని సమాచారం.