ఇది రాహుల్‌ సభా? మహిళల సభా?

193
Public meeting of Rahul Gandhi in Ray Bareilly
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షణం తీరిక లేకుండా తమ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ ప్రచార సభల్ని నిర్వహిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రాయ్ బరేలిలోని ఛాటో గ్రామంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సభకు ఎక్కువ సంఖ్యలోనే జనం హాజరయ్యారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. ఈ సభకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హాజరయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది మహిళల సభలా అనిపించింది. ఇంకేముందీ..ఇంత మంది మహిళలు రాహుల్‌ నిర్వహించిన సభకు హాజరు కావడంతో రాహుల్ లో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. అనంతరం రాహుల్‌ సభలో ప్రసంగిస్తూ..ఇంతమంది మహిళలు సభకు తరలిరావడం తొలిసారి చూస్తున్నానని అన్నారు. అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను రాహుల్‌ ప్రశంసించారు. రాహుల్ వ్యాఖ్యల పట్ల మహిళలు కేరింతలు కొట్టారు.

ఇక ఈ సభలో ప్రధాని నరేంద్రమోదీ పై రాహుల్‌ తనదైన శౌలిలో విమర్శలు చేస్తూ.. ప్రధాని మోదీ చెప్పినట్టు మీ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 15 లక్షలు వచ్చాయా? అని రాహుల్ ప్రశ్నించారు. కేవలం సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే మహిళలకు ఉద్యోగావకాశాలను కల్పిస్తామని, వారి కుటుంబ భద్రత కోసం ప్రత్యేక పథకాలను ప్రకటిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.

- Advertisement -