సోనియా గాంధీకి శుభాకాంక్షాలు తెలిపిన మోదీ

375
modi Sonia Gandhi

ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు నేడు. ఈసందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలియజేశారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్టర్ ద్వారా సోనియా గాంధీకి శుభాకాంక్షాలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సోనియా మరింతకాలం సేవ చేయాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు.

సోనియా గాంధీ 73వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, పలువురు సీనియర్ రాజకీయ నాయకులు జన్మదిన శుభాకాంక్షాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యచారాలపై అసంతృప్తిగా ఉన్న సోనియా గాంధీ..తన పుట్టిన రోజు వేడుకలను దూరంగా ఉన్నట్లు తెలిపారు.