ప్రొ కబడ్డీ…తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్‌

76
pro kabaddi

ప్రొ కబడ్డీ 2021కి సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకోని తెలుగు టైటాన్స్ ఆ వెలితిని తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం తెలుగు టైటాన్స్‌ మేనేజ్‌మెంట్ పలు మార్పులు కూడా చేసింది. గత సీజన్‌లో రాణించిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ను జట్టు తిరిగి దక్కించుకోగా ఆరో సీజన్‌లో బెంగళూరు బుల్స్‌ను విజేతగా నిలిపిన రోహిత్‌ కుమార్‌ను సొంతం చేసుకుని కెప్టెన్‌గా నియమించారు. మరోవైపు డిఫెన్స్‌ విభాగంలో సురేందర్‌, సందీప్‌, అరుణ్‌ లాంటి డిఫెండర్లను జట్టులోకి తీసుకున్నారు.

ఇక ఇవాళ రాత్రి తొలి మ్యాచ్ ప్రారంభంకానుండగా తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది తెలుగు టైటాన్స్‌. రాత్రి 8గంటల 30నిమిషాలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

తెలుగు టైటాన్స్ షెడ్యూల్

 1. డిసెంబర్ 22న తమిళ్ తలైవాస్‌తో
 2. డిసెంబర్ 25న పుణెరీ పల్టాన్‌తో
 3. డిసెంబర్ 28న హర్యానా స్టీలర్స్‌తో
 4. జనవరి 1న బెంగళూరు బుల్స్‌తో
 5. జనవరి 3న పట్నా పైరేట్స్‌తో
 6. జనవరి 5న దబాంగ్ ఢిల్లీతో
 7. జనవరి 8న యూ ముంబాతో
 8. జనవరి 11న గుజరాత్ జయింట్స్‌తో
 9. జనవరి 15న యూపీ యోధాస్‌తో
 10. జనవరి 17న బెంగాల్ వారియర్స్‌తో
  11.జనవరి 19న పింక్ పాంథర్స్‌తో