ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం..

106
omicron

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందకి పైగా దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందగా తాజాగా ఇజ్రాయెల్‌ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. దీంతో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది ఇజ్రాయెల్.

ఇప్పటికే మూడోడోస్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బందికి నాలుగోడోస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా వణికిపోతోంది. ఇటీవలె తొలి మరణం సంభవించగా దేశవ్యాప్తంగా 50కోట్ల ఉచిత కోవిడ్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించారు ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోవడంతో ప్రజలు సాధ్యమైనంత త్వరగా బూస్టర్‌ డోస్‌లు తీసుకోవాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు.