కొత్త అవతారంలో ప్రియా వారియర్‌..

243
Priya Varrier

కొత్త అవతారంలో ప్రియా వారియర్‌..

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఈ అమ్మడి గురించి తెలియనివారుండరు. ‘ఒరు ఆడార్‌ లవ్‌'(తెలుగులో లవర్స్‌ డే) చిత్రంలో కన్నుగీటి నేషనల్‌ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్న . ఈ ముద్దుగుమ్మ తాజాగా సింగర్‌ అవతారం ఎత్తింది. క్రిస్టస్‌ స్టెఫెన్‌ సంగీతం అందించిన పాటను ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పాడగా ఐ ఫోన్‌, డిఎస్‌ఎల్‌ఆర్‌లో చిత్రీకరించారట.

‘పియా రే..’ అని సాగే హిందీ పాటను ప్రియా ఆలపించారు. ఇప్పటికే ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారట. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. చాలా బాగా పాడావంటూ నెటిజ‌న్స్ ప్రియా ప్రకాశ్‌ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాలో నటిస్తుంది.

O Re Piya Re - Priya Varrier | Hindi Song Official Teaser | Happy Tunes Media.