అక్కడ 2లక్షల 25వేలు దాటిన కరోనా కేసులు..

142
corona

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,263 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,25,796కు చేరుకుందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇవాళ 36 మంది వ్యాధి బారిన పడి మృతి చెందగా ఇప్పటివరకు 4,806 మంది మరణించారు. ప్రస్తుతం 29,787 యాక్టీవ్‌ కేసులుండగా.. మొత్తం 1,91,203 మంది రికవర్‌ అయ్యారు.