విద్యుత్ వెలుగుల్లో రాష్ట్రపతి భవన్

213
President inaugurates dynamic facade lighting of Rashtrapati Bhavan
- Advertisement -

69వ రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సర్వాంగ సుందరంగ ముస్తాభైంది. రాష్ట్రపతి భవన్, రైల్ భవన్ లను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మారుతున్న రంగుల్లో రాష్ట్రపతి భవన్ కొత్తశోభ సంతరించుకుంది. సందర్శకులు రాష్ట్రపతి భవన్ లైటింగ్ చూసి అబ్బురపడుతున్నారు.

ఇక రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 18 నుంచి 26వతేదీ వరకు గగనతలంలో ఆంక్షలు విధించారు. 9 రోజుల పాటు ఉదయం పదిన్నర నుంచి 12.15గంటల వరకు దేశీయ విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేయాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. రిపబ్లిక్ డే వేడుకలకు వారంరోజుల ముందు నుంచే రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ- చంఢీఘడ్ ల మధ్య రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా, ఎయిర్ విస్టారా, జెట్ ఎయిర్ వేస్ విమానాలను రద్దు చేశారు. ఢిల్లీ నుంచి చంఢీఘడ్ మీదుగా శ్రీనగర్ వెళ్లే రెండు విమానాలను రీషెడ్యూల్ చేశారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లాల్సిన గో ఎయిర్ విమాన సర్వీసును రద్దు చేశారు.

- Advertisement -