ఆచారి అమెరికా యాత్ర..ట్రైలర్ టాక్

246
Achari America Yatra Theatrical Trailer
- Advertisement -

మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాను తెరకెక్కించాడు. విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, బ్రహ్మానందం కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పౌరోహిత్యం చేసే గురు శిష్యులుగా ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం .. విష్ణు కనిపిస్తున్నారు.

ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా అంటు బ్రహ్మానందం వాయిస్‌తో మొదలైన ట్రైలర్ గురువు గారు ఏం మాట్లాడుతున్నారు మన వాళ్లు ఎవరు ఖండంతారాలు దాటలేదా అక్కడ పూజలు చేయట్లేదా ఏంటి అంటూ విష్ణు చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. ఇక విదేశాల్లో బ్రహ్మీ అడుగుపెట్టగానే పాస్ పోర్టు అధికారులకు పూజలు చేయడం వంటికి ఆకట్టుకున్నాయి. ఆచార్య…ఆచార్య..స్వామి రారా స్వామి రారా అనే బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అలరించింది.

యాక్షన్ కామెడీకి ప్రాధాన్యతనిస్తూ .. ప్రధాన పాత్రలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.మొత్తంగా బ్రహ్మీ కామెడీ సినిమాకే హైలైట్‌గా మారనుందనిపిస్తోంది. జనవరి 26న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -