రాష్ట్రపతి సౌజోర్న్ షెడ్యూల్ ఖరారు..

27
ramnath

దక్షిణాదిలో రాష్ట్రపతి వింటర్ సోజోర్న్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 29 వ తేదీ నుంచి 2022 జనవరి 3 వ తేదీ వరకు రాష్ట్రపతి సదరన్ సోజోర్న్ ఉండగా దక్షిణ భారతంలో 6 రోజులపాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శీతాకాల విడిది ఉండనుంది

సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాంనాథ్ కోవింద్ బస చేయనున్నారు. దక్షిణ భారతంలోనే రాష్ట్రపతి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. రాష్ట్రపతిగా దక్షిణాదిలో రంనాథ్ కోవింద్ కు ఇదే ఆఖరి శీతాకాల విడిది.

భారత 14 వ రాష్ట్రపతిగా జూన్ 2022 తో ముగియనుంది రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం. ఈమేరకు తెలంగాణా ప్రభుత్వానికి సమాచారం అందించింది ఢిల్లీ రాష్ట్రపతి భవన్.