ప్రీ లుక్ : ఫ్యాషన్ డిజైనర్

183
Pre Look: Fashion Designer, S/o Ladies Tailor

సరిగ్గా 32 సంవత్సరాల క్రితం ‘వంశీ’ దర్శకత్వంలో రూపొంది ఎన్నో సంచనాలు సృష్టించిన సినిమా ‘లేడీస్ టైలర్’. ఈ సినిమాకి సీక్వెల్ గా మళ్ళీ వంశీ దర్శకత్వంలో ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ రూపొందుతున్నది. చాలాకాలం నుండి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు సీనియర్ దర్శకుడు వంశీ. ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్‌ అంటూ ఆకట్టుకునే ప్రీలుక్‌తో ముందుకొచ్చాడు.

అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు? అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, రాజోలు పరిసర ప్రాంతాల్లో, పాపికొండల్లోని గోదావరి తీరాల్లో నిర్విరామంగా 62 రోజులు షూటింగ్ పూర్తి చేసుకుని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. సుమంత్ అశ్విన్ హీరోగా అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ “మణిశర్మ” సంగీతం సమకూర్చాడు.

తాజాగా రిలీజైన ప్రీలుక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకమ్మాయి చెస్ట్ దగ్గర కొలతలు తీసుకుంటున్న హీరో. అంతకంటే ఏం కావాలి.. సంచలనాలు క్రియేట్ చేయడానికి. ఉన్నపళంగా జనాలు తన సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో వంశీ అదే చేశాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రీలుక్ టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Pre Look: Fashion Designer, S/o Ladies Tailor

మరి ప్రీ లుక్ తో మాంచి బజ్ నే క్రియేట్ చేస్తున్న వంశీ.. ఫస్ట్ లుక్ తో అలాగే ట్రైలర్ తో ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పాటలను ఏప్రిల్‌లో విడుదల కానుండగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి. వై. సత్య నారాయణ, మాటలు: కళ్యాణ్ రాఘవ్, పాటలు: శ్రీమణి, చైతన్య ప్రసాద్, శ్రీ వల్లి.