‘చెలియా’… మరో ప్రేమ కావ్యం

165
Cheliyaa on April 7

‘ఓకే బంగారం` లాంటి బ్లాక్‌బ‌స్టర్ త‌ర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఓ క్రేజీ చిత్రాన్ని `చెలియా` టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌ద్రాస్ టాకీస్ ప‌తాకంపై తమిళంలో కాట్రు వెలియాదై టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని `చెలియా` టైటిల్‌తో తెలుగులో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కార్తీ, అధితిరావ్ హైదారీ జంట‌గా న‌టిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. మరో ఆరు రోజులు అంటూ కార్తీ,హీరోయిన్ అధితిరావ్‌ను ఓదార్చుతున్న సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఆకట్టుకుంటోంది. గీతాంజ‌లి, రోజా నుండి ఓకే బంగారం వ‌ర‌కు ప‌లు క్యూట్, బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీస్‌ను ప్రేక్ష‌కులకు అందించిన మ‌ణిర‌త్నం సినిమాలంటేనే ఓ క్రేజ్. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫస్ట్ లుక్ దగ్గరి నుంచి తనదైన మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఈ ఏస్ డైరెక్టర్.

Mani Ratnam 'Cheliyaa' Censor Completed

ఇక ఇటీవలె సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా  క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ పొందింది.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల  7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెహ‌మాన్ సంగీత సార‌థ్యంలో వ‌చ్చిన పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్‌ కమ్‌ పైలట్, హీరోయిన్‌ డాక్టర్‌. పైలట్‌, డాక్టర్ కి మధ్య చిగురించిన ప్రేమ కథే ఈ చిత్రం.

Cheliyaa on April 7