ఏప్రిల్ 7న బాహుబలి రిలీజ్‌..

104
Bahubali first part to release again

బాహుబలి సినిమాతో భారతదేశాన్నే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.. దర్శకధీరుడు.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఇప్పుడు.. బాహుబలి 2 సినిమాకు ఆయన ఫాలో అవుతున్న స్ట్రాటజీతో.. మరోసారి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే బాహుబలి 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్  ట్రైలర్ తో యూ ట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. వంద లక్షల వ్యూస్‌తో భారతీయ సినిమా చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా రికార్డులను తిరగరాసింది.

Bahubali first part to release again
బాహుబలి రెండో భాగం ఈ నెల 28న విడుదల కానున్న తరుణంలో బాహుబలి తొలి భాగం ఈ నెల ఏడున విడుదల కానుంది. రెండో పార్ట్‌కు ఊపునిచ్చేందుకు రాజమౌళి బృందం ఇలా తొలి భాగాన్ని మూడు వారాల ముందు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. కలెక్షన్ల రూపంలో బాహుబలి తొలి పార్ట్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్‌తో రూ. 600 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాడు రాజమౌళి.

ఇక ఫస్ట్ పార్ట్ చూసిన వారిలో కనీసం 10 శాతమైనా మళ్లీ థియేటర్లలో బాహుబలి వన్ ను చూస్తారు. సో.. మళ్లీ కలెక్షన్లు వస్తాయి. పైగా.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న క్యూరియాసిటీ జనాల్లో మరింత పెరుగుతుంది. ఇదే.. బాహుబలి 2కు మరింతగా మైలేజ్ తెచ్చిపెడుతుందని జక్కన్న భావిస్తున్నాడట.ఈ ముచ్చటంతా వింటున్న ట్రేడ్ అనలిస్టులు రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఐతే ఇలా రిలీజవుతున్నది హిందీ వెర్షన్ మాత్రమే. తొలి భాగం విడుదలైన సమయంలో హిందీ వెర్షన్ జనాల్లోకి వెళ్లడానికి కొంత సమయం పట్టింది ఈ లోపు సినిమా కొన్ని చోట్ల ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత ప్రేక్షకులు చాలామంది టీవీల్లో.. ఇంటర్నెట్లో సినిమా చూశారు. అలాంటి ప్రేక్షకులు ‘ది కంక్లూజన్’ కంటే ముందు ఒకసారి ‘ది బిగినింగ్’ను వెండితెరపై చూసుకుని.. రెండో భాగానికి తగ్గ  ఎగ్జైట్ మెంట్ తెచ్చుకుంటారని భావిస్తున్నట్లున్నాడు కరణ్ జోహార్.  మొత్తంగా బాహుబలి పార్ట్ 1,2తో మరోసారి ట్రేడ్‌ని షేక్‌ చేసేందుకు సిద్దమవుతున్నాడు జక్కన్న.