దివ్యాంగుడిగా శర్వా…దర్శకుడు ఎవరో తెలుసా..!

216
sharwanand

జాను సినిమాతో ప్రేక్షకులను నిరాశపర్చిన హీరో శర్వానంద్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త దర్శకుడు ప్రకాశ్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ప్రకాష్ అనే ఒక నూతన దర్శకుడు చెప్పిన ఒక వికలాంగుడి కథ శర్వానంద్ కు బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాతో పాటు శర్వా ప్రస్తుతం పల్లెటూరి నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీకారం మూవీలో నటిస్తున్నారు.దీంతో పాటు ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు శర్వా.