ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా!

163
amith shah

ఈ నెల 2న కరోనాతో గుర్‌గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడటంతో ఇవాళ ఉదయం 7 గంటలకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ చేశారు.

దేశవ్యాప్తంగా ముఖ్య‌మంత్రు‌లు, కేంద్ర‌మంత్రులు, మంత్రు‌లతో స‌హా, వివిధ పార్టీల‌కు చెందిన‌ అగ్ర‌నేత‌లు క‌రోనా బారిన‌ప‌డిన సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది కోలుకోగా పలువురు ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఇక దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 36 లక్షలకు చేరువకాగా 66 వేలకు పైగా మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా కరోనా టెస్లులు చేశారు.