అవ‌య‌వ దానం చేసిన సిద్ధాంతి ప్రసాద శర్మ..

149
errabelli

తెలంగాణ బ్రాహ్మ‌ణ సేవా స‌మితి ఆస్థాన సిద్ధాంతి డాక్ట‌ర్ ఎ. ప్ర‌సాద శ‌ర్మ సిద్ధాంతి త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జీవ‌న్ దాన్ కింద అవ‌య‌వ దానం చేశారు. ఈ మేర‌కు జీవ‌న్ దాన్ పత్రాల‌పై సంత‌కాలు చేసిన సిద్ధాంతి, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా మంత్రి క్యాంపు కార్యాల‌యం ప‌ర్వ‌త‌గిరిలో మంత్రిని క‌లిసి, ఆయ‌న స‌మక్షంలో ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ప్ర‌సాద శ‌ర్మ సిద్ధాంతి త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు. మ‌న అనంత‌రం మ‌న అవ‌య‌వాలు మ‌రికొంద‌రికి జీవం పోస్తాయ‌న్నారు. అవ‌య‌వ దానాన్ని ప్రోత్స‌హించాల‌ని, అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిన ప్ర‌సాద్ ని మంత్రి అభినందించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద శ‌ర్మ మాట్లాడుతూ, మ‌న జీవితానంత‌రం కూడా మ‌నం బ‌తికే ఉన్నామ‌న్న ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంద‌న్నారు. మ‌న వ‌ల్ల మ‌రికొంద‌రికి ప్రాణ‌దానం జ‌ర‌గ‌డం కంటే మించిందేమీ ఉండ‌ద‌న్నారు.