బన్నీపై పోలీసులకు ఫిర్యాదు..

277
pushpa

హీరో అల్లు అర్జున్‌తో పాటు పుష్ప మూవీ టీంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచార హక్కు సాధణ స్రవంతి ప్రతినిధులు. ఈ సినిమా షూటింగ్ కోసం కుంటాల జలపాతం సందర్శనను ఆపేస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

అల్లు అర్జున్ కుటుంబంతో పాటు పుష్ప సినిమా టీం టూరిజం నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతో పాటు తిప్పేశ్వర్‌లో సినిమా షూటింగ్ చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరమే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

సుకుమార్ – బన్నీ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గంజాయి స్మగ్లర్ గా బన్నీ కనిపించనున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.