జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

144
modi

ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒక సందేశాన్ని అందరితో పంచుకుంటానని ఆయన తెలిపారు. అయితే ఏ విషయంపై మాట్లాడాలనుకుంటున్నారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో ప్రధాని ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కరోనా పరిస్థితిపైనే ప్రధాని మాట్లాడవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మార్చి నెలలో లాక్ డౌన్ విధించిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించనుండటం ఇది ఏడోసారి కావడం గమనార్హం. 19 మార్చి, 24 మార్చి, 3 ఏప్రిల్‌, 14 ఏప్రిల్‌, 12 మే, 30 జూన్ తేదీల్లోనూ క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో ఇప్ప‌టికే ఆరుసార్లు మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.