బీజేపీ అస‌త్య ప్ర‌చారాల‌కు ధీటైన స‌మాధానం- మంత్రి హరీష్‌

190
Minister Harish Rao
- Advertisement -

మంగళవారం సిద్దిపేట‌లో హ‌రీష్ రావు టీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా ఇన్‌ఛార్జీల‌తో స‌మావేశ‌మై ఎన్నిక‌ల ప్ర‌చారంపై దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఇత‌ర పార్టీలు చేస్తున్న గోబెల్స్ ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని.. ఆ దిశ‌గా ప‌ని చేయాల‌ని పార్టీ సోష‌ల్ మీడియా ఇన్‌ఛార్జీల‌కు మంత్రి హ‌రీష్ రావు సూచించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడ‌ల్‌గా నిలిచింద‌న్నారు. మ‌నం చేసింది చెప్పి.. చెప్పేదే చేద్దామ‌న్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సృష్టిస్తున్న అవాస్త‌వాల‌ను, అస‌త్య ప్ర‌చారాల‌కు ధీటైన స‌మాధానం ఇస్తూ ప్ర‌జ‌ల్లోకి వాస్త‌వాల‌ను తీసుకెళ్లాల‌ని సూచించారు.

బీడీ కార్మికుల పెన్ష‌న్ విష‌యంలో కేంద్ర‌మే రూ. 1600 ఇస్తున్న‌ట్లు, రాష్ర్టం కేవ‌లం రూ. 400 ఇస్తున్న‌ట్లు బీజేపీ ప్ర‌చారం చేసుకుంటుంది. మ‌రి మోదీ సొంత రాష్ర్ట‌మైన గుజ‌రాత్‌లో బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్నారా? అక్క‌డ వృద్ధాప్య పెన్ష‌న్లే రూ. 500 చొప్పున ఇస్తున్నార‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. బీజేపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌లు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. వాటికి అడ్డు క‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వాళ్ళు 10 తప్పుడు ప్రచారం చేస్తే మనం చేసిన 100 మంచి పనులు ప్రజల ముందు పెట్టాలి అని సూచించారు. మ‌నం ప్ర‌జ‌ల్లోకి వాస్త‌వాల‌ను తీసుకెళ్దామ‌ని మంత్రి చెప్పారు. అస‌త్య ప్ర‌చారాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తెచ్చేలా సోష‌ల్ మీడియా టీం ప‌ని చేయాల‌ని మంత్రి హ‌రీష్ రావు సూచించారు.

దుబ్బాక ప్రచారంలో బీజేపీ గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపూ లేకుండా పోతుంది. గోబెల్స్ ను మించి బీజేపీ వాళ్లు అబద్దాల ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ బతికి ఉంటే బీజేపీ నేతల అసత్య ప్రచారాన్ని చూసి ఉరి వేసుకునేవాడు. ఎన్నికలు వస్తాయి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ అడ్డదారులు తొక్కుతూ.. అబద్దాలను ప్రచారం చేస్తూ.. ప్రజలను మభ్య పెట్టేవిషయంలో బీజేపీవాళ్లు తమను తామే మించిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజా స్వామ్యంలో ప్రజల వద్దకు రాజకీయా పార్టీలు వెళ్లినపుడు తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పాలి అని మంత్రి అన్నారు. రాష్ట్రానికి చేయాల్సినవి చేయకుండా, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఇలాంటివి చేస్తే హుజూర్ నగర్, నిజామాబాద్ ఫలితాలే వస్తాయి. ఇలాంటి అబద్దాల ప్రచారం మానుకోండి. బీజేపీ డిపాజిట్ దుబ్బాక ఉపఎన్నికలో గల్లంతవడం ఖాయమని ఎద్దేవ చేశారు.

- Advertisement -