నిఖిల్ ’18 పేజెస్’లో అనుపమ..

152
Nikhil Siddhartha

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం ’18 పేజెస్’. ఈ మూవీ షూటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ ’18 పేజెస్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. అసలైతే ఈ చిత్రం మార్చిలోనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కానీ కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్‌ నిలిచిపోయింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ కోసం ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది.