బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ..

141
PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక సందర్శన యాత్ర ఉత్తరఖండ్‌లో కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నేడు బద్రినాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ప్రధాని రాకతో అధికారులు కేథారినాథ్, బద్రీనాథ్ ఆలయాలతో పాటు హిమాలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బదరీనాథ్ లో మోదీని చూసేందుకు ప్రజలు, భక్తులు ఆసక్తి కనబరిచారు. నిన్న కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించుకొని అక్కడే హిమాలయాల్లోని పవిత్ర గుహల్లో దాదాపు ఇరవై గంటలపాటు ధ్యానంలో పాల్గొన్నారు.

PM Modi

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఇక్కడికి మనశ్శాంతి కోసం వచ్చాను. ఇక్కడే ధ్యానం, ప్రార్థన చేసుకుంటున్నాను. నేను దేవుడిని ఎప్పుడూ ఏదీ కోరుకోను. ప్రకృతి, పర్యావరణాన్ని ఆస్వాదిస్తున్నాను. అదృష్టవశాత్తూ కష్టపడి పనిచేసే బృందం నాకు దొరికింది. మీడియాకు కూడా ధన్యవాదాలు. ఇక్కడి విషయాలను బాగా కవర్‌చేసి ఈ ప్రాంతంలోని పర్యాటకం గురించి ప్రజలకు తెలిసేలా చేశారు.