మీ అందరికి ‘మహర్షి’ సలాం చేస్తున్నాడు..

205
Superstar Mahesh Babu

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తోపాటు పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయ్యి మహేశ్ బాబు గత చిత్రాల రికార్డులన్ని తిరగరాసే విధంగా భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.. ఈ సందర్భంగా మే 18న విజయవాడలో మహర్షి విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ని మేమంటోలతో సత్కరించారు.

Superstar Mahesh Babu

ఈసందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ మాట్లాడుతూ – ” ముందుగా ఇందాక ఆంధ్రా హాస్పిటల్స్ నుండి ఒకాయన వచ్చి అన్నారు పిల్లలకి సర్జరీ చేసే ముందు మీ పేరు చెబితే నవ్వుతారు అని. దీనికన్నా గొప్ప కాంప్లిమెంట్ నేను వినలేదు. అలాగే హైదరబాద్లోని హీల్ ఏ చైల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది వారు కూడా సంవత్సరానికి ఎంత మంది పిల్లలను కాపాడుతారు. మీతో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషం. విజయవాడ వచ్చి ఆ కనక దుర్గ ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు. నా సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడల్లా ఆ తల్లే నన్ను ఇక్కడికి పిలుస్తది. ముందుగా మామయ్య
రాఘేంద్రరావుకి థాంక్స్. ఎందుకంటే ఆయనతో సినిమా చేసినప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ లా చూసుకున్నారు. ఆ రోజే ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దీ. నువ్వు పెద్ద సూపర్ స్టార్ వి అవుతావు అని చెప్పారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

Superstar Mahesh Babu

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఆ పోస్టర్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వైజయంతి బ్యానర్, దిల్ రాజు బ్యానర్, పి వి పి బ్యానర్. ముగ్గురు కలిసి నా 25 సినిమాను ప్రొడ్యూస్ చెయ్యడం అలానే దత్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా 25 వ సినిమా కూడా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. నరేష్, పూజ అందరూ నాకు ఎప్పటికీ స్పెషల్. ఈ సినిమా డెహ్రాడూన్ లో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడే చెప్పా ఈ సినిమా పోకిరి స్క్వేర్ అవుద్ది అని. ఈ మూడు క్యారెక్టర్స్ లో స్టూడెంట్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అది ఎప్పుడూ మర్చి పోలేని కిక్ ఇచ్చింది. గురు స్వామి ఆశీస్సుల వల్లె ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఇక నాన్న అభిమానులందరూ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే….మీకు సినిమా నచ్చితే ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. కానీ నా 25వ సినిమా అన్ని బ్లాక్ బస్టర్ నీ ఒక వారంలో దాటించారు చూసారా సలాం మీ అందరికీ ..మీ గురించి నేను ఎప్పుడూ చెప్పేది చేసేది ఒక్కటే చేతులెత్తి దండం పెట్టడం. థాంక్స్” అన్నారు.

ఈ కార్యక్రమంలో పూజ హెగ్డే ,దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుహీరో అల్లరి నరేష్,అశ్విని దత్,నిర్మాత దిల్ రాజు,ప్రముఖ నిర్మాత పి వి పి, నిర్మాత అనిల్ సుంకర,దర్శకుడు అనిల్ రావిపూడి ,దర్శకుడు వంశీ పైడిపల్లి తోపాటు పలువురు నటీ నటులు పాల్గొన్నారు.