126వ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అండమాన్ దీవుల్లోని 21దీవులకు ప్రధాని మోదీ పేర్లు ప్రకటించారు. పరమ్‌వీర్ చక్ర అవార్డులు పొందిన 21మంది పేర్లను సూచించారు. ఈ సందర్భంగా అండమాన్ దీవుల్లో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్‌ను ఆవిష్కరించారు.
మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్ లాన్స్ నాయక్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘోబా రాణే, నాయక్ జాదునాత్ సింగ్, హవల్దార్ పీరూ సింగ్, కెప్టెన్ జీఎస్ సలేరియా, లెఫ్టినెంట్ కల్నల్ ధాన్ సింగ్ తప్పా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ శైతాన్ సింగ్, కంపెనీ క్వార్టర్‌మాస్టర్ అబ్దుల్ హమిద్, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్దేశిర్ బుర్జోరీ తారాపోర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజరల్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ శేఖన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయిబ్ సుబేదార్ బానా సింగ్, కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్‌ల పేర్లను 21 దీవులకు ఫిక్స్ చేశారు.
అయితే గతంలో ప్రధాని మోదీ రోజ్ ఐలాండ్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్‌గా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. రోజ్ ఐలాండ్‌లో నేతాజీ స్మారకాన్ని నిర్మించనున్నారు. అలాగే నీల్ ఐలాండ్ హేవ్‌లాక్ ఐలాండ్‌కు షాహీద్ ద్వీప్ స్వరాజ్ ద్వీప్ గా గతంలోనే పేరు మార్చారు.
ఇవి కూడా చదవండి…