2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో జనాకర్షక పథకాలకు పెద్దపీట వేసే అవకాశముందని టాక్.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా పైస్థాయిలోనే మధ్యంతర బడ్జెట్ ఉండొచ్చని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌లో రైతన్నలకు పెద్దపీట వేసే అవకాశముంది. రైతులకు త్వరితగతి రుణ మంజూరు నుంచి తక్కువ వడ్డీ రేట్ల వరకు పలు కీలక నిర్ణయాలు వెలువడొచ్చని సమాచారం.
కేంద్రం వేతన జీవులకు, పెన్షన్ తీసుకునే వారికి పన్ను ప్రయోజనాలు అందించనుందని తెలుస్తోంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి.
ట్రేడర్లతోపాటు జీఎస్‌టీ కింద రిజిస్టర్ అయిన వ్యాపారవేత్తలకు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకురావాలని కేంద్ర కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పలు ప్రొడక్టులపై కస్టమ్ డ్యూటీలో మార్పులు ప్రకటించే అవకాశముంది. మొత్తంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే లాస్ట్ బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.