లవ్‌..ఓ అడ్వెంచరే(దేవ్ ట్రైలర్‌)

306
dev
- Advertisement -

కార్తీ-రకుల్ జంటగా రజత్ రవిశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవ్‌. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో సూర్య ట్రైలర్‌ని విడుదల చేశారు. డబ్బు,పేరు కన్నా మనసు ప్రశాంతంగా ఉంటుందో అదిరా నువు చేయాల్సిన పని అంటూ మొదలయ్యే టీజర్‌లో ఐ లవ్‌ అడ్వెంచర్‌ అదే కదా నీ పాస్‌ వర్డు డైలాగ్‌లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. లవ్‌ ఒకరకమైన అడ్వెంచరే అంటూ సాగే డైలాగ్‌లతో సినిమా రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

హరీష్ జైరాజ్ మ్యూజిక్, ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ప్రేమికులు రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది దేవ్. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. నిక్కీ గల్రాని చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండగా ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -