వార్షిక-ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తేడా ఇదే..!

222
Union Budget 2019-20 LIVE
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారు..!జనాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తారా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది.

అయితే మోడీ సర్కార్ ప్రవేశ పెట్టే వార్షిక-ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ మధ్య చాలా తేడా ఉంది. పూర్తిస్థాయి బడ్జెట్‌లో ప్రభుత్వపు గత ఏడాది ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే ప్రస్తుత ఏడాది పన్నుల రూపంలో ఆదాయాన్ని ఎలా సమీకరిస్తాం, వచ్చిన ఆదాయాన్ని వేటి కోసం ఖర్చు పెడతాం అనే ప్రకటనలు ఉంటాయి. కానీ ఓటాన్‌ బడ్జెట్‌లో ఖర్చులకు సంబంధించిన వివరాలే ఉంటాయి.

వార్షిక బడ్జెట్

() గత ఏడాది ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి
()ఆదాయాన్ని ఎలా సమీకరిస్తాం, వచ్చిన ఆదాయాన్ని వేటి కోసం ఖర్చు పెడతాం అనే ప్రకటనలు ఉంటాయి

ఓటాన్ అకౌంట్

()ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలే ఉంటాయి.
()మొత్తం అంచనా వ్యయంలో 1/6 వంతు మొత్తాన్ని పొందొచ్చు
()రెండు నెలల నుంచి 6 నెలల వరకు అమల్లో ఉంటుంది.
()కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనా కూడా అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం లభించకపోతే.. అప్పడు కేంద్రం ఉద్యోగుల వేతనాల చెల్లింపు, ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ,
పెన్షన్ పంపిణీ వంటి వాటా కోసం కన్సాలిడేషన్ ఫండ్ నుంచి నిధుల తీసుకోవడానికి దీన్ని ప్రవేశపెడుతుంది.

- Advertisement -