ఢిల్లీలో మూతపడ్డ పెట్రోల్ బంకులు

264
delhi-petrol-pump
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఈ ఉదయం నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు క్రయ విక్రయాలు నిలిపి వేయాలని ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. దీనికనుగుణంగా పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.

delhi-petrol-pump

కానీ ఢిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కారు మాత్రం వ్యాట్‌ను తగ్గించకపోవడంతో బంకులను మూసేయ్యాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండు రోజుల పాటు నగరంలోని మొత్తం 400 బంకుల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విక్రయాలు నిలిచిపోనున్నాయి. బంకులు తెరచుకోకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఇటీవల కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించిన విషయం తెలిసిందే.

- Advertisement -