కట్నం అడిగినందుకు వరుడికి “శిరోముండనం”

97

కట్నం అడిగిన ఓ వరుడికి వధువు తల్లిదండ్రులు తగిన బుద్ది చెప్పారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చోటుచేసుకుంది. కట్నం కింద బైకు, బంగారం గొలుసు ఇవ్వకుంటే పెళ్లిచేసుకోబోనని వరుడు పెళ్లి పీటలపైనే డిమాండ్ చేశారు. ముందుగా కట్నం లేకుండా వివాహానికి ఒప్పుకుని, ఇప్పుడు పెళ్లిపీటలపై కట్నం గురించి నిలదీస్తున్నాడని వధువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్నోలోని ఖుర్రంనగర్‌కు చెందిన ఓ యువతితో అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్లా కుమాల్ కు వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో వారికి పెళ్లి చేసేందుకు ఇరుకుటుంబాలు అంగీకరించి పెళ్లి ఏర్పాట్లన్నీ చేశారు. అయితే కట్నం కింద బైక్, బంగారం గొలుసు కావాలని అబ్దుల్లా డిమాండ్ చేస్తూ, అవి లేకపోతే పెళ్లిపీటలు ఎక్కబోనని తేల్చి చెప్పాడు. కట్నం ఇవ్వమని ముందే చెప్పామని.. అప్పుడు సరే అని, ఇప్పుడు వరుడు మొండికేసి కూర్చున్నాడు. దీంతో ఆగ్రహించిన వధువు బంధువులు అతనిని చావబాదారు.

ఓ పిల్లర్‌కు కట్టేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా అతనికి గుండు గీయించి, పోలీసులకు అప్పగించారు. పెళ్లి పీటలపై అడ్డదిడ్డంగా మాట్లాడిన యువకుడికి తగిన బుద్ది చెప్పి, పెళ్లిని రద్దు చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.